కాంగ్రెస్ లోకి బీజేపీ ఎంపీ సోయం బాపూరావు?

61చూసినవారు
కాంగ్రెస్ లోకి బీజేపీ ఎంపీ సోయం బాపూరావు?
తెలంగాణలో బీజేపీకి మరో షాక్ తగిలే అవకాశం ఉంది. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు పార్టీ మారనున్నట్లు ప్రచారం జరుగుతోంది. టికెట్ కేటాయింపుపై అధిష్ఠానం నుంచి క్లారిటీ లేకపోవడంతో పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆయన కాంగ్రెస్ లో చేరే అవకాశమున్నట్లు సమాచారం. తాజాగా అమిత్ షా మీటింగ్ కు ఆయన హాజరుకాకపోవడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తోంది. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్