పెళ్లి రోజున ప్రియుడితో వధువు పరార్

155453చూసినవారు
పెళ్లి రోజున ప్రియుడితో వధువు పరార్
యూపీ లఖింపూర్ ఖేరీలోని నీమ్‌గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. స్థానిక యువతి తనకు బంధువైన యువకుడిని ప్రేమించింది. ఆమెకు పెద్దలు మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయించారు. అయితే పెళ్లి రోజున వధువు ఇంట్లోని నగదు, నగలు తీసుకుని ప్రియుడితో పరారైంది. వరుడు బంధువులతో సహా అక్కడకు చేరుకున్నాక ఈ విషయం తెలిసింది. దీంతో వారు వెనుదిరిగారు. పరారీలో ఉన్న ప్రేమజంట కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్