ఆస్తి కోసం గొడవ.. తల్లిని చంపిన కొడుకు

7675చూసినవారు
ఆస్తి కోసం గొడవ.. తల్లిని చంపిన కొడుకు
గుజరాత్‌లోని గాంధీనగర్‌లో దారుణం జరిగింది. హిమాన్షు అనే వ్యక్తి తన తల్లి కమలారాణి (70)తో పాటు నివసిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల తల్లి నడుపుతున్న దుకాణాన్ని తన పేరుపై రిజిస్టర్ చేయాలని అడిగాడు. అందుకు తల్లి ఒప్పుకోలేదు. దీంతో తల్లిని పైపుతో పలుమార్లు కొట్టి చంపాడు. అనంతరం తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే మెట్ల పక్కన 2 రోజులు ఉంచాడు. నిందితుడికి మానసిక సమస్యలున్నాయని పోలీసుల విచారణలో తేలింది.

సంబంధిత పోస్ట్