డీలిమిటేషన్ పేరుతో దక్షిణాదికి అన్యాయం చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. "డీలిమిటేషన్ వల్ల దక్షిణాదిలో ఎంపీ సీట్లు తగ్గవని అమిత్ షా చెబుతున్నారని, కానీ సీట్లు పెరుగుతాయని మాత్రం చెప్పడం లేదు. ఇప్పటికే నిధులన్నీ ఉత్తరాది రాష్ట్రాలకు ఇస్తూ.. దక్షిణాదికి అన్యాయం చేస్తున్నారు. సీట్లు రాని దక్షిణాది రాష్ట్రాలను మాత్రం నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తున్నారు." అని రేవంత్ మండిపడ్డారు.