ఏపీలోని నంద్యాల జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. నందికొట్కూరులో 'ఫిరోజ్ సిటీ కేబుల్' నిర్వాహకులు ప్రైవేటుగా చూద్దామనుకున్న పోర్న్ వీడియోలను పొరపాటున ఛానల్‌లో ప్లే చేశారు. ఆ ఛానల్ పెట్టిన వందలాది మందికి అసభ్యకర దృశ్యాలు కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు 10 నిమిషాలపాటు నీలి చిత్రాలు ప్రదర్శితమయ్యాయని పేర్కొన్నారు. పోలీసులు ముగ్గురు యజమానులపై కేసు నమోదు చేశారు.