మహారాష్ట్ర, రాజస్థాన్ తదితర ప్రాంతాల నుంచి హైబ్రిడ్ బంతి, చామంతి, గులాబి తదితర పువ్వులు రవాణా చేసుకుంటున్నామని విక్రయదారులు తెలిపారు. ప్రస్తుతం పూల దిగుమతి తగ్గిందని, దాని కారణంగా ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. అదే విధంగా రవాణా ఖర్చులు ఎక్కువ అవ్వడంతో గిట్టుబాటు ధర లేకపోవడంతోనే ధరలు పెరుగుతున్నాయన్నారు. మరోవైపు పండుగలకు తోడు పెళ్లి ముహూర్తాలు ఉండడంతో పూలకు డిమాండ్ పెరిగిందని వ్యాపారులు అంటున్నారు.