ఏపీలో ‘పల్లె పండుగ’.. మార్గదర్శకాలు జారీ

84చూసినవారు
ఏపీలో ‘పల్లె పండుగ’.. మార్గదర్శకాలు జారీ
ఏపీలో పల్లె పండుగ పేరిట గ్రామ పంచాయతీల్లో ఈ నెల 14-20వ తేదీ వరకు ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ పనులను జనవరి నెలాఖరులోగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. ఉపాధి హామీ పథకం నిబంధనలకు అనుగుణంగా పని చేయాలని, జియో ట్యాగింగ్ సహా అన్ని వివరాలను పీఆర్ వన్ యాప్‌లో నమోదు చేయాలని పేర్కొంది. సోషల్ ఆడిట్ తర్వాత బిల్లులు చెల్లిస్తామని వెల్లడించింది.

సంబంధిత పోస్ట్