తిరుమల శ్రీవారిని సినీ, రాజకీయ ప్రముఖులు ఇవాళ దర్శించుకున్నారు. సీనీ దర్శకుడు కె.బాబి, సంగీత దర్శకుడు తమన్, సినీ నటుడు అశ్విన్ బాబు, బీజేపీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ స్వామి సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదా ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి, పట్టువస్త్రంతో సత్కరించారు.