రాష్ట్ర ప్రజలపై విద్యుత్ భారం పడనుందా?

66చూసినవారు
రాష్ట్ర ప్రజలపై విద్యుత్ భారం పడనుందా?
AP: యాక్సిస్ ఎనర్జీ పేరిట రాష్ట్ర ప్రజలకు మరోసారి విద్యుత్ షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఈ సంస్థతో ఒప్పంద వ్యవధి 25 ఏళ్లలో వినియోగదారులపై రూ.14,186.92 కోట్ల అదనపు భారం పడనుంది. సౌర, పవన ప్రాజెక్టుల నుంచి 1,174.90 మెగావాట్ల విద్యుత్ ఒప్పందాలు కుదుర్చుకోవడానికి విద్యుత్ సంస్థలు పావులు కదుపుతున్నాయి. ఆ ప్రతిపాదనలు ఇప్పటికే రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి చేరాయి. దీనికి ఏపీఈఆర్‌సీ ఆమోదం తెలిపితే, ఆ భారం ప్రజలపై పడనుంది.

సంబంధిత పోస్ట్