పింఛన్ తీసుకునే వారికి అలర్ట్

59చూసినవారు
పింఛన్ తీసుకునే వారికి అలర్ట్
AP: పింఛన్ల అంశంపై కూటమి ప్రభుత్వం సీరియస్‌గా ఫోకస్ పెట్టింది. అనర్హుల ఏరివేత కోసం తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే. మొన్నటి వరకు హెల్త్, మంచానికి పరిమితమైన వారి కోటాలో పింఛన్లను తీసుకుంటున్న వారిని తనిఖీ చేసింది. అయితే దివ్యాంగుల కేటగిరీలో అనర్హులు ఉన్నారంటూ భారీ ఫిర్యాదు వచ్చాయి. ఫిబ్రవరి 1 నుంచి దివ్యాంగ కేటగిరీలో పింఛన్లు పొందుతున్న వారికి పరీక్షలు నిర్వహించనున్నట్లు సమాచారం. అనర్హులను గుర్తించి వారి పింఛన్‌ను నిలిపివేస్తారు.

సంబంధిత పోస్ట్