సీఎం కార్యాలయానికి బాంబు బెదిరింపు

81చూసినవారు
సీఎం కార్యాలయానికి బాంబు బెదిరింపు
బీహార్‌లోని పట్నాలో గల ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ కార్యాలయానికి బాంబు బెదిరింపు రావడంతో కలకలం చెలరేగింది. ఈ నేపథ్యంలో సీఎం కార్యాలయ భద్రతా వ్యవస్థను మరింత అప్రమత్తం చేశారు. కార్యాలయ ప్రాంగణంలో అణువణువు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తీవ్రవాద సంస్థ అల్ ఖైదా పేరుతో సీఎం కార్యాలయానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీనిపై సెక్రటేరియట్ పిఎస్ లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. తరువాత ఏటీఎస్ కూడా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్