మేడ్చల్ జిల్లా అల్వాల్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన సోదరిని వేధిస్తున్నాడంటూ ప్రకాష్ అనే యువకుడి కుటుంబంపై యువతి సోదరుడు వివేక్ దాడికి పాల్పడ్డాడు. ఇంటికి వెళ్లి మరీ ప్రకాష్‌పై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో యువకుడితో పాటు మరో ఇద్దరు చిన్నారులకు గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.