పుచ్చ సాగు వేసవికి అనువైన పంట. కానీ ప్రస్తుతకాలంలో అన్ని కాలాలకు అనువైన రకాలు రావడం వలన మన రైతులు అన్ని కాలాల్లో సాగుచేస్తున్నారు. మన రైతులు బోదెల పద్ధతి, ఎత్తు బెడ్ల పద్ధతుల్లో విత్తుకుంటారు. ఈ రెండు పద్దతుల్లో విత్తనం విత్తేప్పుడు జిగ్ జాక్ పద్ధతి అనుసరించి ఎత్తు బెడ్లకు రెండు వైపులా లేదా బోదేకు రెండు వైపుల మొక్కల మధ్య 75 సెంటి మీటర్లు, సాలుల మధ్య దూరం 120 సెంటి మీటర్ల దూరాలను పాటిస్తూ విత్తనాన్ని విత్తుకోవాలి.