వరంగల్ జిల్లా మంగం పేట మండలంలో దైవ దర్శణానికి వెళ్తున్న భక్తుల కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన కిషోర్ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం లక్ష్మీనృసింహుని దర్శనానికి బయలుదేరారు. ఘాట్ రోడ్డులో పైకి ఎక్కుతున్న క్రమంలో కారు ఒక్కసారిగా వెనక్కి వెళ్లి లోయలో పడింది. అయితే ఓ చెట్టు అడ్డుగా రావడంతో దానికి తగులుకొని ఆగిపోయింది. దీంతో కారులో ఉన్న వారు స్వల్పగాయాలతో బయటపడ్డారు.