టీం ఇండియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్ (103) సెంచరీ బాదాడు. ఈ శతకంతో భారత్‌పై అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. 167 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన స్మిత్ కెరీర్‌లో ఇది 34వ శతకం. ఈ సిరీస్‌లో ఆయనకిది రెండో శతకం కాగా, టీం ఇండియాపై 11వది. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు 104.2 ఓవర్లకు 411/7. క్రీజ్లో స్మిత్‌తో పాటు స్టార్క్ ఉన్నారు.