దేశవ్యాప్తంగా ఏడు రోజులు సంతాప దినాలు

57చూసినవారు
దేశవ్యాప్తంగా ఏడు రోజులు సంతాప దినాలు
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఏడు రోజుల పాటు జాతీయ సంతాప దినాలుగా ప్రకటించింది. ఇక రేపు ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. మన్మోహన్ అంత్యక్రియలను ప్రభుత్వ గౌరవాలతో లాంఛనంగా జరగనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

సంబంధిత పోస్ట్