డిసెంబర్ 6న ఢిల్లీ వైపుగా పాదయాత్ర చేస్తామని హర్యానాలోని శంభు సరిహద్దులో సమ్మె చేస్తున్న రైతులు ప్రకటించారు. ఛండీగఢ్లో సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చాల ఆధ్వర్యంలో సోమవారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పంటలకు కనీస మద్దతు ధర(MSP)కి చట్టబద్ధమైన హామీతో పాటు రైతులకు సంబంధించిన ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతుల డిమాండ్ల పరిష్కారానికి కేంద్రం ఎలాంటి చర్చలు జరపడం లేదని ఫైరయ్యారు.