హైడ్రా విషయంలో తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. బుద్ధభవన్‌లోని B-బ్లాక్‌లో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక నుంచి అక్రమ నిర్మాణాలపై హైడ్రా PSలో అధికారులు కేసులు నమోదు చేయనున్నారు. హైడ్రాకి విస్తృతాధికారాలు కల్పిస్తూ.. సర్కార్ ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.