మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ చేసింది BRS కార్యకర్తలే అని BJP MP రఘునందన్‌రావు అన్నారు. BRS నుంచి డబ్బులు తీసుకున్న వారే ఇలాంటి ట్రోలింగ్ చేశారని చెప్పారు. 'ట్రోలింగ్‌పై హరీశ్‌రావు క్షమాపణ చెప్పాలి, కేవలం ఒక ట్వీట్ పెట్టడం కాదు. కొండా సురేఖపై ట్రోలింగ్ చేసిన వ్యక్తి హరీశ్ ఫొటోను డీపీగా పెట్టుకున్నారు. అధికారిక కార్యక్రమంలో మంత్రిని సన్మానిస్తే, దారుణంగా పోస్టులు పెడతారా?' అని ప్రశ్నించారు.