రైతుల‌ ఆత్మ‌హత్య‌ల‌పై క‌మిటీ వేసిన బీఆర్ఎస్‌

67చూసినవారు
రైతుల‌ ఆత్మ‌హత్య‌ల‌పై క‌మిటీ వేసిన బీఆర్ఎస్‌
తెలంగాణ‌లో ఆందోళనకర స్థాయికి చేరిన రైతు ఆత్మహత్యలు, వ్యవసాయ సంక్షోభ పరిస్థితుల‌పైన బీఆర్ఎస్‌ ఆధ్వర్యంలో 9 మందితో కూడిన అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో 9 మంది సభ్యులు గల ఈ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో నెలకొన్న దుర్భరమైన పరిస్థితులను అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి, వ్యవసాయ శాఖ మంత్రికి, వ్యవసాయ కమిషన్ కు, కేసీఆర్ కి ఒక నివేదికను అందజేస్తుందని తెలిపారు.

ట్యాగ్స్ :