తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 30 నుంచి 7వరకు గురుకుల బాట కార్యక్రమాన్ని నిర్వహించాలని BRS నిర్ణయించింది. గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీలను పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు సందర్శించనున్నారు. స్కూళ్ల పరిస్థితులను అధ్యయనం చేసేందుకు RS ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యులతో అధ్యయన కమిటీ వేసింది. ఈ కమిటీ నివేదికను పార్టీకి సమర్పిస్తుంది.