రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులకు రూ.1,400 కోట్లు మంజూరు చేశామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సంక్రాంతి నాటికి రాష్ట్రంలో ఎక్కడా రోడ్లపై గుంతల్లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. యువతకు ఉద్యోగ కల్పనే ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్తున్నామని, మనం చేసే రాజకీయం కేవలం ప్రజల కోసమే అని వ్యాఖ్యానించారు. త్వరలోనే రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూసమస్యలు పరిష్కరిస్తామని చంద్రబాబు తెలిపారు.