ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నైనిటాల్ జిల్లాకు చెందిన ఓ బస్సు 27మంది ప్రయాణికులతో భీమ్‌టాల్ నుంచి హల్ద్వానీకి వెళ్తుండగా అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా 24 మంది గాయపడ్డారు. ఎస్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక శాఖ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి.