గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో తాజాగా విషాద ఘటనజరిగింది. నగరంలోని డాంకోట్ రోడ్డులో తల్లి, కుమారుడు (7) నడుచుకుంటూ వెళ్తున్నారు. అదే సమయంలో ఓ సిటీ బస్సు యూటర్న్ తీసుకుంది. రోడ్డుపై నడుస్తున్న తల్లీకొడుకును బస్సు డ్రైవర్ గమనించలేదు. వారిని బస్సు ఢీకొట్టి, తొక్కుకుంటూ పోయింది. తల్లి కళ్ల ముందే సంఘటనా స్థలంలో బాలుడు చనిపోయాడు. తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద వీడియో నెట్టింట వెలుగులోకి వచ్చింది.