3 నెలల్లో స్టేషన్ ఘన్‌పూర్ కు ఉపఎన్నిక: KCR

30792చూసినవారు
3 నెలల్లో స్టేషన్ ఘన్‌పూర్ కు ఉపఎన్నిక: KCR
వచ్చే 3 నెలల్లో స్టేషన్ ఘన్ పూర్ కు ఉపఎన్నిక రాక తప్పదాని BRS చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఈ సారి తాటికొండ రాజయ్య ఎమ్మెల్యేగా గెలుస్తారని వ్యాఖ్యానించారు. వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ.. 'కడియం శ్రీహరికి ఏం తక్కువ చేశాను? కడియం శ్రీహరి ఎందుకు పార్టీ మారారు? కడియం పార్టీకి ద్రోహం చేశారు. కడియం చేసిన మోసానికి ఆయన రాజకీయ జీవితం శాశ్వతంగా సమాధి అవుతుంది' అని మండిపడ్డారు.