తెలంగాణలో ప్రభుత్వం గత మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించడంలేదని ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీల అసోసియేషన్ (TPDPMA) పేర్కొంది. ఫలితంగా కళాశాలల నిర్వహణ భారంగా మారిందని తెలిపింది. దీంతో బకాయిలు చెల్లించేవరకు రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ కాలేజీల నిరవధిక బంద్ కు పిలుపునిస్తున్నట్లు ప్రకటించింది.