యూపీలోని ముజఫర్‌నగర్‌లో ఓ యువకుడు అందరూ చూస్తుండగానే చోరీకి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే..
దుండగుడు న్యూ మండి కొత్వాలి ప్రాంతంలోని బైక్ షోరూంకు స్కూటీని కొనేందుకు వచ్చాడు. తన పాత వాహనాన్ని అక్కడ ఆపి స్కూటీని ట్రయల్ రన్ చేస్తానని బయటికి వచ్చాడు. ఇక తిరిగి రాలేదు. ఎంత గాలించినా అతడి ఆచూకీ లభించకపోవడంతో చివరికి షోరూం నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.