భోజనం తర్వాత గ్రీన్ టీ తాగవచ్చా?

80చూసినవారు
భోజనం తర్వాత గ్రీన్ టీ తాగవచ్చా?
ప్రస్తుతం ఆరోగ్యం కోసం చాలామంది గ్రీన్ టీ తాగుతున్నారు. గ్రీన్ టీ జీవక్రియను పెంచి అధిక బరువును తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అయితే భోజనం చేసిన వెంటనే దీన్ని తీసుకోకూడదు. దీనిలోని కెఫిన్, టానిన్లు జీర్ణక్రియకు హానీ కలిగించి అజీర్తికి కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఖాళీ కడుపుతో దీన్ని తీసుకుంటే దీనిలోని టానిన్ల కారణంగా కడుపులో యాసిడ్ పెరిగి కడుపు నొప్పి, గ్యాస్ సమస్యలు వస్తాయి.

సంబంధిత పోస్ట్