నెట్‌వర్క్ లేకున్నా పోయిన ఫోన్ కనిపెట్టొచ్చా?

57చూసినవారు
నెట్‌వర్క్ లేకున్నా పోయిన ఫోన్ కనిపెట్టొచ్చా?
ఈ రోజుల్లో పోయిన ఫోన్ కనిపెట్టడం చాలా కష్టం. కానీ ఇప్పుడు ఈ సమస్యలకు ఫుల్‌స్టాప్ పెడుతూ గూగుల్ తన ఫైండ్ మై డివైస్‌ను అప్‌గ్రేడ్ చేసింది. దీనిద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకపోయినా మొబైల్ కనిపెట్టొచ్చు. ప్రస్తుతానికి అమెరికా, కెనడాలో మాత్రమే అందుబాటులో ఈ సదుపాయం.. త్వరలో ప్రపంచవ్యాప్తంగా వాడుకోవచ్చని బ్లాగ్‌లో పేర్కొంది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ 9 లేదా, ఆ తర్వాత వెర్షన్ ఫోన్‌లకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది.