మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సాగర్ జిల్లా డియోరీ పోలీస్ స్టేషన్ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై కుక్కను రక్షించే క్రమంలో శుక్రవారం అర్థరాత్రి కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని.. క్షతగాత్రుడిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.