నార్వే చెస్‌ టోర్నీ విజేతగా కార్ల్‌సన్

67చూసినవారు
నార్వే చెస్‌ టోర్నీ విజేతగా కార్ల్‌సన్
నార్వే చెస్‌ టోర్నీ-2024 ఛాంపియన్‌గా వరల్డ్‌ నంబర్‌ వన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్ నిలిచాడు. శ‌నివారం జ‌రిగిన ఫైన‌ల్ రౌండ్‌లో ఫాబియానో కారువానాపై కార్ల్‌సన్ విజ‌యం సాధించాడు. నార్వే చెస్ టోర్నీలో సంచలన ప్రదర్శన చేసిన భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద మూడో స్థానంతో సరిపెట్టాడు. చివరిదైన 10వ రౌండ్‌లో అతను వరల్డ్ నం.3 హికారు నకమురా(అమెరికా)తో తలపడ్డాడు. ఆర్మగెడాన్ గేమ్‌లో నకమురాను ప్రజ్ఞానంద ఓడించాడు.