రామోజీరావులో చిన్న పిల్లాడిని చూశా: చిరంజీవి (వీడియో)

57చూసినవారు
రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు మరణంతో తెలుగు జాతి పెద్ద దిక్కును కోల్పోయిందని హీరో చిరంజీవి అన్నారు. రామోజీ పార్థివదేహానికి చిరు నివాళులర్పించారు. 'ప్రజారాజ్యం పార్టీ స్థాపన సమయంలో సలహాలు, సూచనలు కోసం రామోజీని కలిసేవాడిని. అందరూ ఆయనలో గంభీరాన్ని చూస్తే.. నేను చిన్న పిల్లాడిని చూశా. నేను పెన్ను ఇస్తే సంతోషంగా తీసుకున్నారు. ఆయన మరణం రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు' అని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్