బాయ్‌ఫ్రెండ్‌ను చంపిన కేసు.. యువతికి ఉరిశిక్ష

59చూసినవారు
బాయ్‌ఫ్రెండ్‌ను చంపిన కేసు.. యువతికి ఉరిశిక్ష
కేరళలోని తిరువనంతపురం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. బాయ్‌ఫ్రెండ్‌‌కు విషమిచ్చి చంపిన కేసులో యువతి గ్రీష్మకు ఉరి శిక్ష విధిస్తూ సోమవారం తీర్పు ఇచ్చింది. ఈ కేసులో గత వారం యువతిని దోషిగా నిర్ధారించిన కోర్టు ఆ మేరకు శిక్షను ఖరారు చేసింది. అంతేకాకుండా ఈ హత్య కేసులో నిందితురాలికి సహకరించిన ఆమె అంకుల్ నిర్మలా సీతారామన్ నాయర్‌కి కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది.