MPలోని ఇందౌర్‌లో గుడి ఎదుట ఉన్న ఓ యాచకురాలికి బిచ్చం వేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీఎన్‌ఎస్‌లోని సెక్షన్ 223 కింద గురువారం కేసు నమోదైంది. కోర్టులో ఈ ‘నేరం’ రుజువైతే దాతకు ఏడాది వరకు జైలుశిక్ష లేదా రూ.5 వేలు జరిమానా.. లేదా రెండూ కలిపి విధించే అవకాశముంది. ఇందౌర్‌ను దేశంలోకెల్లా తొలి యాచక రహిత నగరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో జనవరి 1 నుంచే బిచ్చం వేయడం, స్వీకరించడాన్ని నిషేధించింది.