ఉమ్మడి కుటుంబం మాదిరిగా జాతి నిర్మాణం జరగాలి: భట్టి

75చూసినవారు
ఉమ్మడి కుటుంబం మాదిరిగా జాతి నిర్మాణం జరగాలి: భట్టి
ఉమ్మడి కుటుంబం మాదిరిగా జాతి నిర్మాణం జరగాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. దేశ సంపద.. దేశ ప్రజలే పంచాలన్నారు. ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డా ఇది నా దేశమని గర్వంగా తలెత్తుకునేలా చేయాలని అభిలషించారు. భవిష్యత్తులో రాహుల్‌గాంధీ దేశానికి నాయకత్వం వహించాలని ఆకాంక్షించారు. దేశంలోని జనాభా దామాషా ప్రకారం జనగణన జరగాలన్నారు. దేశ జనాభాకు అనుగుణంగా సంపద పంచాలనేది రాహుల్‌ ఆలోచన అని చెప్పారు.