TG: రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం గాంధీ భవన్లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశ్యంతో రాహుల్ గాంధీ సూచనతో కులగణన చేస్తున్నామని తెలిపారు. కులగణన దేశానికే ఒక రోల్ మోడల్‌గా నిలబడుతుందని అన్నారు. కేసీఆర్, కిషన్‌రెడ్డి ఒక్కటేనని విమర్శించారు.