యూకే పర్యటనకు వెళ్లేందుకు మాజీ సీఎం జగన్‌‌కు సీబీఐ కోర్టు అనుమతి

1078చూసినవారు
యూకే పర్యటనకు వెళ్లేందుకు మాజీ సీఎం జగన్‌‌కు సీబీఐ కోర్టు అనుమతి
ఏపీ మాజీ సీఎం జగన్‌ విదేశీ పర్యటనకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. అక్రమాస్తుల కేసులో జగన్ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా, సెప్టెంబర్‌ 3 నుంచి 25 వరకు కుమార్తె పుట్టినరోజు కోసం యూకే వెళ్లేందుకు ఆయన కోర్టు అనుమతి కోరారు. యూకే వెళ్లే ముందు పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు, మొబైల్ నంబరు, మెయిల్ వివరాలు కోర్టుకు, సీబీఐకి ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్