ముగిసిన జస్టిస్‌ చంద్రచూడ్‌ పదవీకాలం

73చూసినవారు
ముగిసిన జస్టిస్‌ చంద్రచూడ్‌ పదవీకాలం
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ పదవీకాలం నేటితో ముగిసింది. దీంతో సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్‌ న్యాయమూర్తి అయిన జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా 51వ భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఎన్నికల బాండ్లు, ఆర్టికల్‌ 370 రద్దు వంటి చరిత్రాత్మక తీర్పులు వెలువరించిన ధర్మాసనాల్లో జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా కీలక భూమిక పోషించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్