ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి మొదలుకానున్నాయి.ఈ సమావేశాలకు జగన్ దూరంగా ఉంటున్నారా అంటే అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈసారి సభలో వైసీపీ సోషల్ మీడియా గురించి ప్రజలకు వివరించాలని చంద్రబాబు సర్కార్ ప్లాన్ చేస్తోందట. వైసీపీ నేతలు వచ్చినా, రాకపోయినా సోషల్ మీడియా పోస్టుల గురించి లైవ్లో ప్రదర్శించడం ఖాయమని ప్రచారం సాగుతోంది. దీన్ని ముందుగానే పసిగట్టిన జగన్, అసెంబ్లీకి రానని సంకేతాలు ఇచ్చారని అంటున్నారు.