నేర చరిత్ర కలిగిన వ్యక్తితో కలిసి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఇద్దరు పోలీసులు సస్పెన్షన్‌కి గురయ్యారు. ఈ ఘటన తాజాగా మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. నయీ అబాది పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐలు సునీల్ తోమర్, జగదీష్ ఠాకూర్‌లు క్రిమినల్ రికార్డ్స్ ఉన్న పప్పు దయమా అనే వ్యక్తితో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో వారిద్దరినీ ఉన్నాతాధికారులు సస్పెండ్ చేశారు.