దేశంలో పెరుగుతున్న ఉల్లి ధరలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇది వరకే సేకరించి ముందస్తుగా నిల్వ చేసిన (బఫర్ స్టాక్) స్టాక్‌ను హోల్‌సేల్ మార్కెట్లోకి విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి నిధి ఖరే సోమవారం పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా రాయితీ ఉల్లిని రిటైల్‌గా విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి రూ.55-60 వరకు పలుకుతోంది.