రాజీనామా వార్తలను ఖండించిన నానా పటోలే

84చూసినవారు
రాజీనామా వార్తలను ఖండించిన నానా పటోలే
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటమికి బాధ్యత వహిస్తూ మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే రాజీనామా చేసినట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై పటోలే స్పందించారు. తాను రాజీనామా చేయలేదని తెలిపారు. రాజీనామా చేసినట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని చెప్పారు. మహా వికాస్ అఘాడీ చెక్కుచెదరకుండా ఉంటుందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్