పార్లమెంట్ భద్రత చేపట్టనున్న CISF

76చూసినవారు
పార్లమెంట్ భద్రత చేపట్టనున్న CISF
ఢిల్లీలోని పార్లమెంట్ భద్రత బాధ్యతలను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) చేపట్టనుంది. CISF సిబ్బంది ఇవాళ్టి నుంచి పార్లమెంట్ ఆవరణలో ఉగ్రవాద వ్యతిరేక, విధ్వంస నిరోధక భద్రత విధులు నిర్వహిస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇప్పటివరకు CRPF సిబ్బంది పార్లమెంట్ భద్రతను పర్యవేక్షించారు. CRPFకు చెందిన పార్లమెంట్ డ్యూటీ గ్రూప్ తన కమాండోలను ఉపసంహరించుకోవడంతో CISFకు అప్పగించారని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్