తొలకరి జల్లులకు బయటపడుతున్న వజ్రపు రాళ్లు

1067చూసినవారు
తొలకరి జల్లులకు బయటపడుతున్న వజ్రపు రాళ్లు
కర్నూలు జిల్లా తుగ్గిలి, జొన్నగిరి, అనంత‌పురం జిల్లా వ‌జ్రక‌రూరులో వ‌జ్రాల కోసం వేట మొద‌లైంది. ఈ ప్రాంతాలతో పాటు ఎమ్మిగనూరు, కోసిగిలోని పంటపొలాల్లో కూడా వజ్రాలు లభిస్తూ ఉంటాయి. తొలక‌రి జ‌ల్లుల‌కు పొలాల్లో వ‌జ్రపు రాళ్లు బ‌య‌ట‌ప‌డుతుంటాయి. చిన్న రాయి దొరికినా చాలు త‌మ జీవితాలు మారిపోతాయ‌నే ఆశ‌తో జ‌నం పెద్ద ఎత్తున జ‌ల్లెడ ప‌డుతున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు.