పార్లమెంటు సమగ్ర భద్రత బాధ్యతలు ఇక పూర్తిస్థాయిలో ‘సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)’ నిర్వహించనుంది. సీఐఎస్‌ఎఫ్ ఉగ్రవాద నిరోధక భద్రత విభాగానికి చెందిన 3300 మందికిపైగా సిబ్బంది సోమవారం నుంచి విధులు నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు సీఆర్పీఎఫ్ (CRPF)కు చెందిన పార్లమెంట్ డ్యూటీ గ్రూప్ (PDG), ఢిల్లీ పోలీస్, పార్లమెంటు సెక్యూరిటీ స్టాఫ్ (PSS)లు ఉమ్మడిగా ఈ బాధ్యతలు నిర్వహించాయి.