భూమిపై పడ్డ ఉల్క..వందల కి.మీ. వరకు వెలుగు

77చూసినవారు
భూమిపై పడ్డ ఉల్క..వందల కి.మీ. వరకు వెలుగు
స్పెయిన్‌, పోర్చుగల్‌ ఆకాశంలో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కఅతమైంది. ఓ భారీ నీలిరంగు ఉల్క భూమిపై పడింది. ఆ సమయంలో వచ్చిన వెలుగు పగలును తలపించింది. ఒక్కసారిగా చోటు చేసుకొన్న ఈ ఘటనతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఈ వెలుగు కొన్ని వందల కిలోమీటర్ల దూరం కనిపించినట్లు తెలుస్తోంది. ఈ ఉల్కా ఎక్కడ నేలను తాకిందో ఎవరూ కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఇది క్యాస్ట్రో డైరో ప్రాంతంలో పడినట్లు ప్రచారం జరుగుతోంది. వివరాలు పూర్తిగా వెల్లడికావాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్