సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీలో మరోసారి బయటపడ్డ వర్గపోరు (వీడియో)

57చూసినవారు
తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గపోరు బయటపడింది. హుజూర్‌నగర్ మండలం శ్రీనివాసపురంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టి నాయకులు తమను పట్టించుకోవడం లేదని, పార్టిలో గుర్తింపు దక్కడం లేదని జిల్లా మైనార్టీ అధ్యక్షులు నిజాముద్దీన్ అసమ్మతి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సభ్యుల మధ్య గొడవ జరిగింది. దీంతో అక్కడ ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను అదే పార్టీలోని మరో వర్గ సభ్యులు చింపి, నానా హంగామా చేశారు.

సంబంధిత పోస్ట్