నవంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆడేందుకు భారత క్రికెట్ జట్టు తొలి బ్యాచ్ ఆదివారం రాత్రి ఆస్ట్రేలియాకు బయలుదేరింది. తొలి బ్యాచ్‌లో మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, ఆకాశ్ దీప్ ఉన్నారు. వీరితో పాటు కోచింగ్ సిబ్బంది కూడా ఆస్ట్రేలియా వెళ్లారు. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌తో మిగిలిన భారత క్రికెట్ జట్టు ఆటగాళ్ల రెండో బ్యాచ్ సోమవారం ఆస్ట్రేలియాకు బయలుదేరనుంది.