యూపీలో కూలిన పాఠశాల బాల్కనీ, 40 మంది చిన్నారులకు గాయాలు

78చూసినవారు
యూపీలోని బారాబంకి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని అవధ్ అకాడమీ స్కూల్ బాల్కనీ శుక్రవారం ఉదయం కూలిపోవడంతో 40 మంది చిన్నారులు శిథిలాల కింద ఇరుక్కుపోయి గాయపడ్డారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, గాయపడ్డ విద్యార్థులను స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. అయితే గాయపడిన వారిలో ఐదుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్