ఎయిర్ ఇండియా విమానంలో కలకలం

56చూసినవారు
ఎయిర్ ఇండియా విమానంలో కలకలం
ఓ ప్రయాణికుడు విమానం నుంచి దూకేందుకు యత్నించడం దుబాయ్ నుంచి మంగళూరు వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో కలకలం రేపింది. అతడిని కేరళకు చెందిన మహ్మద్‌గా గుర్తించినట్లు సిబ్బంది తెలిపారు. తమతో తప్పుగా ప్రవర్తించాడని, అనంతరం ఫ్లైట్ నుంచి దూకేస్తానంటూ బెదిరించాడని పేర్కొన్నారు. అడ్డుకుని ల్యాండ్ అవగానే విమానాశ్రయ అధికారులకు అప్పగించామని స్పష్టం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్